close

తాజా వార్తలు

 పొత్తుపై ఆప్‌, కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

దిల్లీ: ఎప్పటికప్పుడు ఇరు పార్టీల నాయకులు పొత్తుకు అవకాశం లేదని ప్రకటనలు చేస్తోన్న దిల్లీలో కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా, పొత్తు విషయంలో మాత్రం ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. ఆప్ తమది ఒంటరి పోరని ప్రకటించినా, కాంగ్రెస్‌ మాత్రం ఆ పార్టీతో భాగస్వామ్యంపై ఇతర అవకాశాలను పరిశీలిస్తూనే ఉంది. 

దీనిపై ఆప్‌ నేషనల్ కన్వీనర్‌ గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉండబోదని, తమ పార్టీకి ఓటు వేస్తే దిల్లీకి రాష్ట్ర హోదా తీసుకువస్తామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం పొత్తుకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దానిపై దిల్లీ కాంగ్రెస్‌ యూనిట్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ(దిల్లీ విభాగం) పీసీ చాకో మాట్లాడుతూ..‘ఆప్‌తో పొత్తు కోసం దిల్లీ కాంగ్రెస్‌ నాయకులతో చర్చిస్తున్నాను’ అని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి దేశవ్యాప్తంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. దిల్లీ కాంగ్రెస్‌ విభాగం కూడా ఈ సెంటిమెంట్‌ను అంగీకరిస్తుందని అనుకుంటున్నాం. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడిదే’ అని ఆయన పేర్కొన్నారు. కానీ దిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించారు. 

మార్చి 23 నుంచి ఆప్‌ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనుందని గోపాల్ రాయ్ తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 వరకు 280 జనసభలను నిర్వహిస్తుందన్నారు.  


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు