close

తాజా వార్తలు

సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్న బోనీ

ముంబయి: బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘బదాయీ హో’. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడు. సాన్యా మల్హోత్రా కథానాయిక. నీనా గుప్తా ప్రధాన పాత్ర పోషించారు. అమిత్‌ శర్మ దర్శకుడు. మనవడు, మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో ఓ మహిళ గర్భవతి అయితే పెళ్లీడు కొచ్చిన ఆమె పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. కేవలం రూ.29 కోట్లతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ.220 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో రీమేక్‌ హక్కులకు డిమాండ్‌ ఏర్పడింది. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ దక్షిణాది భాషల్లో ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. త్వరలోనే దక్షిణాదిలో రీమేక్‌ను తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. బోనీ నిర్మించిన ‘తేవర్‌’ సినిమాతో అమిత్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన తీసిన రెండో సినిమా ‘బదాయీ హో’.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు