close

తాజా వార్తలు

తొలి లోక్‌పాల్‌గా జస్టిస్‌ పీసీ ఘోష్‌ నియామకం

దిల్లీ: దేశ ప్రథమ లోక్‌పాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ను తొలి లోక్‌పాల్‌గా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017లో పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎంపిక సంఘం ఆయన పేరును ఎంపికచేసింది. లోక్‌పాల్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా జస్టిస్‌ దిలీప్‌ బి. భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌, జస్టిస్‌ అభిలాష కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా దినేష్‌ కుమార్‌ జైన్‌, అర్చనా రామసుందరం,  మహేందర్‌ సింగ్‌, ఇందర్జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లను నియమించారు. 

కోల్‌కతాలోని పేరు ప్రఖ్యాతులు దివాన్‌ బనారసీ ఘోష్‌ కుటుంబంలో పీసీ ఘోష్‌ ఐదో తరం న్యాయవాది. ఆయన పూర్వీకుడు హరచంద్ర ఘోష్‌ కోల్‌కతాలో బ్రిటిష్‌ వారు నెలకొల్పిన సదర్‌ దివానీ అదాలత్‌కు 1876లో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తండ్రి శంభు చంద్ర ఘోష్‌ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1976లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న పీసీ ఘోష్‌ 1997లో ఆ హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యారు. 2012లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయి, అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2013 మార్చిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడ దాదాపు నాలుగేళ్లు పనిచేసిన అనంతరం 2017 మే నెలలో పదవీ విరమణ చేశారు. అదే ఏడాది జూన్‌ 29 నుంచి మానవ హక్కుల సంఘం సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు