close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడి

చ‌రిత్రలో ఆమె
హర్షిణి కన్హేకర్‌ - మొదటి మహిళా ఫైర్‌ఫైటర్‌

ఆధునిక యువతులకు స్ఫూర్తిగా నిలుస్తూ  ధైర్యసాహసాలకు ప్రతీక అయిన హర్షిణీ కన్హేకర్‌ మనదేశంలో తొలి మహిళా ఫైర్‌ ఫైటర్‌. ప్రస్తుతం ఆమె ఓఎన్‌జీసీ ఫైర్‌ సర్వీసుకు డిప్యూటీ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
హర్షిణి స్వస్థలం నాగ్‌పూర్‌. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే సాగింది. చదువుల్లో మెరిక కాకపోయినా... ఇతర అంశాల్లో చురుగ్గా ఉండేవారు. డిగ్రీ పూర్తి చేశాక ఎన్‌సీసీలో చేరారు. ఆ యూనిఫాం ధరించినప్పుడు గర్వంగా అనిపించేదట. అందుకే ఎంబీఏ పూర్తి చేశాక కార్పొరేట్‌ కొలువు కాదని ఫైర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుకు దరఖాస్తు చేశారు. అలా 2002లో నాగ్‌పూర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌లో ఆ కోర్సుకు ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. అమ్మాయి కావడంతో ఆమెకి ప్రత్యేకంగా వసతి కల్పించలేక ఇంటి నుంచి రావడానికి అనుమతి ఇచ్చారు. శిక్షణలో భాగంగా ‘పెద్ద పెద్ద పైపులు పట్టుకుని పరిగెత్తడం... నీరు చిమ్మడం... బరువులు పట్టుకుని అంతస్థులు ఎక్కడం... ఇలా ఎన్నో ఉండేవి. మగవాళ్లకే అవన్నీ కష్టం. దాంతో నేను చేయలేకపోయేదాన్ని. అయినా పొద్దున్నే గంటలు గంటలు వ్యాయామం చేసి అందుకు అనుగుణంగా ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించేదాన్ని’ అని అంటారు హర్షిణి.

ఒకసారి దిల్లీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో దాదాపు ఆరు గంటలపాటు నిల్చొనే మంటలు ఆర్పడం, జనాల ప్రాణాలు కాపాడటం వంటివి చేశారు. అలా ఎన్నో ప్రమాదాల్లో వీలైనంతమందిని కాపాడారామె. ఆమె ఫైర్‌ పైటర్‌గా అగ్నిమాపక శాఖలో చేరాక... 2006లో ఓఎన్‌జీసీలో మూడు కీలక ఫైర్‌ స్టేషన్లను చూసుకునే బాధ్యతలు అందుకున్నారు. ఈ ఏడాది డిప్యూటీ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆసక్తి ఉంటే ఎవరైనా ఈ రంగంలోకి రావొచ్చని అంటారామె.


మరిన్ని