close

ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కోసమే మెరుపు దాడులు! 

భాజపా భయానక వాతావరణం సృష్టిస్తోంది 
నేషనల్‌ కాన్ఫరెన్సు అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులకు ఆదేశించిందని నేషనల్‌ కాన్ఫరెన్సు అధ్యక్షుడు, శ్రీనగర్‌ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా సోమవారం ఆరోపించారు. భాజపా అన్ని వేదికలపైనా విఫలమైందని, అందువల్ల ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌తో కొట్లాట లేదా యుద్ధం సంభవించాలని ఆ పార్టీ కోరుకుందని విమర్శించారు. అలా కొట్లాటకు దిగితే మోదీ లేకుండా భారతదేశం మనుగడ సాగించలేదన్న రీతిలో ప్రధాని సరికొత్త అవతార పరుషుడిగా అవతరిస్తారని చెప్పారు. ‘‘ఈ మెరుపు దాడులు కేవలం ఎన్నికల కోసం చేపట్టినవి. మనం రూ.కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని కోల్పోయాం. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ నుంచి ప్రాణాలతో గౌరవప్రదంగా రావడం ఒక్కటే సంతోషకరం’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు లాభించేట్లుగా భాజపా ఓ రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో జట్టుకట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మేం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ అంశంపై ఆలోచించాలి’’ అని బదులిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు