close

ఆంధ్రప్రదేశ్

ఒవైసీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు 

ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హిదాయత్‌

ఈనాడు, అమరావతి: మోదీ, కేసీఆర్‌, జగన్‌, ఒవైసీలు కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హిదాయత్‌ ఆరోపించారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘కేంద్రంలో భాజపాను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు అసదుద్దీన్‌ ఒవైసీ సహాయ, సహకారాలు అందజేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో 160 స్థానాల్లో ముస్లిం ఓట్లను చీల్చేందుకు అభ్యర్థులను నిలబెట్టి భాజపాను గెలిపించడమే ఇందుకు నిదర్శనం. ఏపీకి వచ్చి జగన్‌ తరఫున ప్రచారం చేస్తామంటున్నారు, ఆయనకు ఇక్కడ అడుగుపెట్టే అర్హతే లేదు. వస్తే తగిన గుణపాఠం చెబుతాం. హైదరాబాద్‌ పాతబస్తీలో ముస్లింల పిల్లలను సంక్షేమానికి దూరంగా ఉంచుతూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు’ అని ఆరోపించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు