close

ఆంధ్రప్రదేశ్

అక్రమాలకు సహకరిస్తారనే కేసీఆర్‌కు మద్దతు 

జగన్‌పై మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: వైకాపా తరఫున పోటీ చేయాలనుకునే వారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు కప్పం కట్టాల్సి వస్తోందని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. తాను చేస్తున్న అక్రమాలకు మద్దతుగా ఉంటారనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ కలిసిపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల ద్వారా కడప జిల్లాలో ఆయనకు చెక్‌ పెడతామని సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. 
జగన్‌ నోరు మెదపరా?: సీఎం రమేష్‌ 
కడప ఉక్కు పరిశ్రమపై తమిళనాడుకు చెందిన డీఎంకే నేతలు మాట్లాడుతుంటే... ప్రతిపక్షనేత జగన్‌ కనీసం నోరు మెదపడం లేదని తెదేపా ఎంపీ సీఎం రమేష్‌ మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద ఆర్థిక సాయం అందిస్తుంటే దిల్లీకి వెళ్లి దానిపైనా ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు