close

ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్‌లో మరోసారి ‘దాడి’ 

ఎన్నికల్లో లబ్ధి కోసం భాజపా ఎత్తుగడ: మమతా బెనర్జీ

కోల్‌కతా: కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నిర్వహణను సాగదీయడం వెనుక ‘భాజపా లబ్ధి ప్రణాళిక’ ఉందని ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ ఆరోపించారు. సోమవారమిక్కడ ఆమె మాట్లాడుతూ తమ అభ్యర్థులను మంగళవారం ప్రకటిస్తామని చెప్పారు. ‘‘ఏదోక పేరుతో కేంద్రం ఏప్రిల్‌లో మరోసారి శత్రుదేశంపై దాడి చేయనుందని సీనియర్‌ పాత్రికేయులు కొందరు నాకు చెప్పారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని భాజపా ఎత్తుగడ వేస్తున్నట్టు తెలిసింది. అందుకే ముఖ్యమైన పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో శాంతి భద్రతల నెపంతో ఎన్నికల ప్రక్రియను మే 19 వరకూ సాగదీశారు. ఇదంతా భాజపా ఆడుతున్న ఎన్నికల క్రీడ. ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించినా మాకేం ఇబ్బంది లేదు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలనూ మేమే గెలుచుకుంటాం. మా ప్రజలు ఎలాంటివారో నాకు తెలుసు. వారి పట్ల నాకు ఎంతో గౌరవముంది. భాజపాకు మాత్రం అదేం లేదు. ఎండల్లో జనాన్నీ, రంజాన్‌ దీక్ష చేపట్టేవారిని ఇబ్బంది పెట్టాలన్నది వారి ఉద్దేశం’’ అని మమత విరుచుకుపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు