close

ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణుడివా.. డీఎన్‌ఏ ఆధారాలివ్వు 

రాహుల్‌పై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దిల్లీ: కర్ణాటక భాజపా నేత, కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మతం గురించి ప్రశ్నించారు. క్రైస్తవ తల్లికి జన్మించిన వ్యక్తి గాంధీ ఎలా కాగలరో రుజువు చేయాలన్నారు. తాను బ్రాహ్మణుడినని రుజువు చేసుకునేందుకు రాహుల్‌ డీఎన్‌ఏ ఆధారాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన ఉత్తర కన్నడలో ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. గత నెల 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం జరిపిన దాడులకు ఆధారాలను రాహుల్‌ గాంధీ అడిగారని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్‌ గాంధీ హత్యకు గురైనప్పుడు ఆయన భౌతిక కాయాన్ని గుర్తించడానికి ఆయన సంతానం నుంచి డీఎన్‌ఏ నమూనాలను అధికారులు అడిగారని హెగ్డే చెప్పారు. అయితే రాహుల్‌ డీఎన్‌ఏ ఇవ్వడానికి సోనియా గాంధీ నిరాకరించారని, ప్రియాంక నుంచి నమూనాలు సేకరించాలని సూచించినట్లు పేర్కొన్నారు. ‘‘నేను ఇది హాస్యానికి చెప్పడంలేదు. దీనిపై రికార్డులను నేను చూపగలను’’ అని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు