close

ఆంధ్రప్రదేశ్

పోటీకి ప్రియాంక దూరం!

లఖ్‌నవూ: ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో కాంగ్రెస్‌ పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేసే అంశంపై మాత్రమే ఆమె దృష్టి సారిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రియాంక పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్‌కు పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీల నుంచి రాహుల్‌, సోనియాలు బరిలోకి దిగుతుండటం వల్ల కూడా ప్రియాంక ఈసారి పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు