close

ఆంధ్రప్రదేశ్

అపోహలను జయించిన అమ్మ మనసు

మూలకణ దానంతో పసికందుకు ప్రాణదానం
చరిత్ర సృష్టించిన తమిళనాడు మహిళ

కోల్‌కతా: మూలకణ దానంపై సమాజంలో నెలకొన్న అపోహలను పటాపంచలు చేస్తూ తమిళనాడుకు చెందిన ఓ ధీర వనిత తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పసికందు ప్రాణాలు నిలబెట్టారు. రోగితో బంధుత్వమేదీ లేకపోయినా ఎముక మజ్జ దానం చేసిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

26 ఏళ్ల మసిలమణి స్వస్థలం కోయంబత్తూరు సమీపంలోని ముధలిపాలయం గ్రామం. ఆరేళ్ల క్రితం ఆర్‌.కవియరసన్‌తో ఆమెకు వివాహమైంది. ఆ దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. నెలల వయసులోనే కుమార్తె థలసీమియా వ్యాధి బారినపడటంతో వారు ఏళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మూలకణాలు దానం చేసేందుకు దంపతులు ముందుకొచ్చినప్పటికీ, కుమార్తెకు అవి సరిపోలలేదు. దిల్లీకి చెందిన 3 నెలల బాబుకు మసిలమణి మూలకణాలు ఉపయోగపడతాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు విషయం తెలియజేశారు. దీంతో కనీసం ఆ బాబు ప్రాణాలనైనా కాపాడాలని మసిలమణి భావించారు. భర్తకు విషయం చెప్పగా.. ఆయన సంతోషంగా అంగీకరించారు. అయితే అత్తింట్లోని ఇతరులు, ఇరుగుపొరుగు ఆమెను హెచ్చరించారు. ఎముక మజ్జ మార్పిడితో విపరీత పరిణామాలు ఎదురవుతాయని, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మంచానికే పరిమితమవ్వాల్సి వస్తుందని ఆమె మనసులో అనేక సందేహాలు రేకెత్తించారు. నిపుణులను సంప్రదించిన మసిలమణి.. అవన్నీ అపోహలేనని నిర్ధారించుకున్నారు. నిండు మనసుతో ఈ ఏడాది జనవరిలో బాబుకు మూలకణాలు దానం చేశారు. ఇప్పటికీ బాబు ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ, చికిత్స విజయవంతమైనట్లేనని వైద్యులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు