close

ఆంధ్రప్రదేశ్

సీట్ల సర్దుబాటుపై చర్చలు 

జనసేన, వామపక్షాల మధ్య పంపకాలు నేడు కొలిక్కి వచ్చే అవకాశం

ఈనాడు, అమరావతి: సీట్ల సర్దుబాటుపై సోమవారం వామపక్ష, జనసేన పార్టీల మధ్య చర్చలు సాగాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వామపక్షాలు జిల్లాకు రెండు చొప్పున శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాలు కావాలని కోరుతున్నాయి. రెండు మూడు శాసనసభ సీట్ల విషయంలో పార్టీల మధ్య స్పష్టత రావాల్సి ఉందని తెలిసింది. లోక్‌సభ స్థానాల విషయంలో పెద్దగా చర్చ జరగలేదని సమాచారం. మంగళవారం మరోమారు సమావేశమై సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. జనసేనలోకి ఎవరైనా పెద్ద నాయకులు వస్తే ఎంపీ సీట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ పార్టీ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. 
సీపీఎం కర్నూలు, విశాఖపట్నం.. సీపీఐ విజయవాడ, అనంతపురం పార్లమెంటు స్థానాలను  కోరుతున్నాయి. ఒకవేళ పొత్తుల్లో భాగంగా జనసేన ఈ స్థానాల్లో ఏమైనా రెండు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా గుంటూరు, కడప ఎంపీ స్థానాలు ఇవ్వాలని కోరుతున్నాయి. సీపీఐలో రాష్ట్ర కార్యదర్శులు పోటీచేసే అవకాశం ఉన్నా రామకృష్ణ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. సీట్లు, అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఈ నెల 14న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటిస్తామని  రామకృష్ణ పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు