close

ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్‌ మేనిఫెస్టో 16న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను వయో పరిమితి 50 ఏళ్లకు తగ్గింపు.. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ వంటి ప్రధాన హామీలతో ఏపీ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల పూర్తిస్థాయి అమలు, కనీస ఆదాయ భరోసా పథకాన్ని ఇందులో చేర్చింది. ‘కాంగ్రెస్‌ అభయ హస్తం’ పేరుతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తున్న ఏపీసీసీ ఈ నెల 16న దాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి ప్రణాళికలో చేరుస్తోంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, నెల్లూరులో దుగరాజపట్నం పోర్టు వంటి వాటితో పాటు ఇతర జిల్లాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అజెండాలో చేర్చనుంది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల అజెండాలో చేర్చనున్న కీలక అంశాలు

పింఛన్లు 
50- 60 ఏళ్ల మధ్య వయసు వారికి- రూ.2 వేలు 
60- 70 ఏళ్ల మధ్య వారికి      - రూ.2,500 
70 ఏళ్లు దాటిన వారికి         - రూ.3 వేలు 
మహిళలకు 
డ్వాక్రా సంఘాలకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ

పేద కుటుంబాలకు ఏటా ఉచితంగా 4 గ్యాస్‌ సిలిండర్లు  
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు 
రైతులకు  
రూ.2 లక్షల రుణమాఫీ 
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు 
ఇతర అంశాలు 
108, 104, బంగారుతల్లి, అమ్మహస్తం వంటి పథకాలు మరింత సమర్థంగా అమలు

అన్ని వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తింపు

వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం

కాంట్రిబ్యూటరీ పింఛను విధానం (సీపీఎస్‌) రద్దు

తెల్ల రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం, 9 రకాల నిత్యవసరాల పంపిణీ 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపునకు కృషి 
ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల అమలు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు