close

ఆంధ్రప్రదేశ్

సంకా రవిశేఖర్‌ను విడుదల చేయాలి

పౌరహక్కుల సంఘం డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంకా రవి శేఖర్‌ను ఫిబ్రవరి 7న ఉదయం 9 గంటలకు కృష్ణా జిల్లా నున్న గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయనను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. శేఖర్‌ 25 సంవత్సరాల క్రితమే విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చారని పేర్కొంది. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు అని, 22 ఏళ్లుగా చార్టెడ్‌ అకౌంటెంట్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని, ఆయనకు  భార్య, ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కనీసం రక్త సంబంధీకులకు సమాచారం అందించలేదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో అదుపులోకి తీసుకొని ఉంటారని, ఆయన ఆచూకీని కుటుంబీకులకు తెలియపర్చాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు