close

ఆంధ్రప్రదేశ్

మౌఖిక పరీక్షల తేదీలలో స్వల్ప మార్పు!

ఈనాడు, అమరావతి: సహాయ ఆచార్యుల పోస్టుల మౌఖిక పరీక్ష షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో ఉన్న మౌఖిక పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చి, రోస్టర్‌ రిజర్వేషన్‌, స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తి చేసిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి వర్తించదని ఉన్నత విద్యామండలి పేర్కొంటోంది. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే మౌఖిక పరీక్షలు జూన్‌ 10తో పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు