close

ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖల నిలిపివేత

తిరుమల, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం జేఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ తితిదేతో ఎన్నికలకు, ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా.. ఓటర్లను ప్రలోభపెట్టేలా సిఫార్సు లేఖలు జారీ చేసే అవకాశం ఉన్నందున గతంలో మాదిరిగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనానికి నెలకోసారి కంటే ఎక్కువసార్లు వచ్చే వారిపైనా నియంత్రణ విధించనున్నట్లు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు