close

ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కరికల్‌ వలవెన్‌

ఈనాడు-అమరావతి: ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవెన్‌ను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం సచివాలయంలో సన్మానించారు. పదోన్నతి పొందిన ఆయన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోనే కొనసాగనున్నారు. పురపాలక సంచాలకులు కె.కన్నబాబు,     మెప్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చినతాతయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు కరికల్‌    వలవెన్‌ను అభినందించడంతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో ఆయన హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు