close

ఆంధ్రప్రదేశ్

3.5 టీఎంసీలు ఇవ్వండి

కేఆర్‌ఎంబీకి లేఖ రాసిన ఏపీ ఈఎన్‌సీ

ఈనాడు, హైదరాబాద్‌: తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డెల్టా ప్రాంతానికి వెంటనే 3.5 టీఎంసీల జలాలు విడుదల చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య సంఘాన్ని (కేఆర్‌ఎంబీ) ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు కోరారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలంటూ సోమవారం ఆయన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మే నెల నాటికి తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాలను ఆయన బోర్డుకు తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి హంద్రీనీవా సుజల స్రవంతి కింద 2.5 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింద ప్రకాశం జిల్లాకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 3 టీఎంసీలు అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వాటా కింద కేటాయింపులు చేయాలని కోరారు. దీనికోసం శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువనుంచి తీసుకునే నీటిలో వెసులుబాటు కల్పించాలని సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు