close

ఆంధ్రప్రదేశ్

స్వగృహ రిజిస్ట్రేషన్‌ రుసుముల వాపసు

ఈనాడు-అమరావతి: స్వగృహ ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించిన వారంతా వాటిని తిరిగి పొందేందుకు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్వగృహ కార్పొరేషన్‌ ఎండీ బి.రాజగోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. వివిధ కారణాలతో ప్రాజెక్టులు చేపట్టని జిల్లాల్లో ఇళ్ల కోసం ఇప్పటికే రూ.3వేల నుంచి రూ.5 వేలు చొప్పున రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించిన వారందరికీ తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. వివిధ జిల్లాల దరఖాస్తులను పరిశీలించి చెల్లింపులు చేస్తున్నామని, మిగతా వారంతా కూడా 31లోగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా దరఖాస్తులను తపాలాలో జిల్లా ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ కార్యాలయాలకు పంపినా అనుమతిస్తున్నామని అన్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుము రశీదుతో పాటు దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలు   జతచేయాలని రాజగోపాల్‌ సూచించారు. వీరందరికీ ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు