close

ఆంధ్రప్రదేశ్

ఓటరు గుర్తింపు కార్డు పోతే ఓటు హక్కు పోదు

ఈనాడు, అమరావతి: ఓటరు గుర్తింపు కార్డు పోయినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయినట్లు కాదని భారత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ కార్డులను అనుమతించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటరు ఫొటో గుర్తింపు కార్డు లభ్యం కాకపోతే.. ప్రత్యామ్నాయంగా 11 ఫోటో గుర్తింపు పత్రాలు / కార్డులను అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఫిబ్రవరి 28న ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ‘గరీబ్‌ గైడ్‌’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు