close

ఆంధ్రప్రదేశ్

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల కేసు వాయిదా

ఈనాడు, దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. జయంత్‌ అభియాన్‌, తహసీన్‌ పూనావాలా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య, జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్‌ రంజన్‌గొగొయి, జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌, జస్టిస్‌ వి.ఈశ్వరయ్య పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు