close

ఆంధ్రప్రదేశ్

స్ఫూర్తిప్రదాతలకు ‘పద్మ’ ప్రదానం

దిల్లీ: వివిధ రంగాల్లో ప్రశంసనీయ కృషి చేసి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 47 మంది వ్యక్తులకు ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయకుడు శంకర్‌ మహదేవన్‌, మలయాళనటుడు మోహన్‌లాల్‌, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా,  రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులున్నారు. ప్రఖ్యాత పాత్రికేయుడు కుల్‌దీప్‌ నయ్యర్‌కు మరణానంతరం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాన్ని ఆయన సతీమణి స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు హాజరయ్యారు.

యువత వ్యవసాయంపై దృష్టి సారించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో యువత వ్యవసాయంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతు నేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు పెద్దపీట వేస్తూ పద్మ పురస్కారాలు ఇవ్వడం హర్షణీయమన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సదస్సులు, సమావేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ రైతుల ప్రోత్సాహంతోనే ఈ అవార్డు లభించిందన్నారు. రైతునేస్తం యాప్‌ ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో భవనాలపైన సేంద్రీయ వ్యవసాయం చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయంలోనూ మంచి లాభాలు సాధించవచ్చని యువత  తెలుసుకోవాలని వెంకటేశ్వరరావు సూచించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు