close

ఆంధ్రప్రదేశ్

తానా 22వ మహాసభల లోగో ఆవిష్కరణ

ఈనాడు, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల చిహ్నాన్ని(లోగో) అధ్యక్షుడు సతీశ్‌ వేమన, మహాసభల కన్వీనర్‌ డాక్టరు రావు మూల్పూరి, ఛైర్మన్‌ డాక్టరు కొడాలి సోమవారం అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఆవిష్కరించారు. జులై 4 నుంచి 6 వరకు ఇక్కడ తానా మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడా, భారత్‌ జెండాలతోపాటు అమెరికా చట్ట సభల భవనం కాపిటల్‌ హిల్‌ కుక్‌, కాకతీయ తోరణం, అమరావతి బుద్దుడి విగ్రహాలతో కలిపి ఐక్యత-నైపుణ్యం-పురోగమనం నేపథ్యంతో రూపొందించామని తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన తెలిపారు. మహాసభలకు ముందు వివిధ నగరాల్లో సాంస్కృతిక పోటీలు, విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు కవులు, కళాకారులు, మేధావులు ఈ సభలకు హాజరవుతారని వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు