close

ఆంధ్రప్రదేశ్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వాయిదా!

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా మే 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు ఏడో విడత లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున పరీక్ష తేదీ మారనుంది. రెండు రోజులు లేదంటే వారం రోజులు పరీక్ష ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. అడ్వాన్సుడ్‌ పరీక్షను మే 19వ తేదీన జరపాలని ఐఐటీ రూర్కీ గత నవంబరులోనే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పరీక్షకు 2.24 లక్షల మంది హాజరవుతారు. అయితే మే 19వ తేదీన 7వ విడత లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల తేదీ మారే అవకాశం లేనందున పరీక్ష తేదీనే మార్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తేదీ మార్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నత విద్య కార్యదర్శి సుబ్రమణ్యం తెలిపారు.

మెయిన్‌కు ఇబ్బంది లేదు
జేఈఈ మెయిన్‌ రెండో విడతను ఏప్రిల్‌ 6 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహిస్తామని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది. ఆ మధ్యలో నాలుగు లేదా అయిదు రోజులపాటు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్‌ 11న తొలి విడత, 18న రెండో విడత పోలింగ్‌ జరగనుంది. ఆ తేదీలను మినహాయించి జరుపుకోవచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు