close

ఆంధ్రప్రదేశ్

కొత్త ఓటరుకు కానుక

టర్లకు పంచేందుకు వివిధ రాజకీయ పార్టీలు సిద్ధంచేసిన ఎన్నికల తాయిలాలు ఎంతమాత్రం కావు ఇవి. ప్రజాస్వామ్య పరిరక్షణలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించే సమాచారంతో కూడిన క్యాలెండర్లు. 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లందరికీ వీటిని అందించనున్నారు. ప్రత్యేక ప్యాకింగ్‌తో ముస్తాబు చేసి ఈ క్యాలెండర్లపై కొత్త ఓటర్ల చిరునామాలు కూడా అతికించారు. ప్రస్తుతం వీటిని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచారు. పోలింగ్‌ బూత్‌స్థాయిల్లో ఉండే అధికారుల ద్వారా త్వరలో వీటిని అందజేసేందుకు
ఏర్పాట్లు చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు