close

ఆంధ్రప్రదేశ్

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవోగా అర్జా శ్రీకాంత్‌

ఏపీ భవన్‌లో ఆయనకు ఘనంగా వీడ్కోలు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవోగా ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక కార్యదర్శిగానూ ఆయన వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శ్రీకాంత్‌కు ఆత్మీయ సన్మానం జరిగింది. దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ రాయబారిలా శ్రీకాంత్‌ సేవ చేశారని కొనియాడారు. శ్రీకాంత్‌ చేసిన సేవలు అభినందనీయమని ఏపీఈడీబీ ప్రత్యేక కమిషనర్‌ భావనా సక్సేనా అన్నారు. తెలంగాణ భవన్‌ ఇన్‌ఛార్జి ఆర్సీ వేదాంతం గిరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రీకాంత్‌ అద్భుతంగా సేవలందించారన్నారు. భవన్‌ అధికారులు, సిబ్బందికి శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవోగా యువతకు ఉపాధి కల్పించి సేవచేసే అవకాశం లభించడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు