close

ఆంధ్రప్రదేశ్

నీట్‌ రాష్ట్ర ర్యాంకుల విడుదల

పీజీ వైద్య విద్యలో ఉత్తమ ర్యాంకు 13
  దంత వైద్యలో ఉత్తమ ర్యాంకు 24

ఈనాడు, అమరావతి: పీజీ, దంత వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-2019 ఫలితాలను అనుసరించి రాష్ట్ర ర్యాంకుల జాబితాలను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదివి నీట్‌లో అర్హత సాధించిన వారి జాబితాలను వేర్వేరుగా సోమవారం ప్రకటించింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హతలు, ఇతర వివరాలు పరిశీలించిన అనంతరం ప్రతిభావంతుల జాబితా ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ అప్పలనాయుడు వెల్లడించారు. దీని ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని, విద్యార్థుల అవగాహన కోసం జాబితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు