close

ఆంధ్రప్రదేశ్

14, 15 తేదీల్లో కృష్ణా జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన

నూజివీడు, న్యూస్‌టుడే: ఈనెల 14, 15వ తేదీల్లో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి ఈ నెల 14న మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వెళతారు. సాయంత్రం 4.30 గంటలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చేరుకుని.. అక్కడ 5.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆత్కూరుకు తిరిగి వెళతారు.  15న ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ట్రస్టు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. ప్రత్యేక విమానంలో బేగంపేట వెళతారని కలెక్టర్‌ వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు