close

ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి అమరావతిలో ‘ఎయిమ్స్‌’ సేవలు

మంగళగిరి, న్యూస్‌టుడే: అమరావతి పరిధిలోని మంగళగిరిలో నిర్మించిన అఖిలభారత వైద్య శాస్త్రాలసంస్థ(ఎయిమ్స్‌)లో మంగళవారం నుంచి అవుట్‌ పేషెంట్లకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ సిన్హా, డీన్‌ జోయ్‌అజయ్‌గోష్‌ స్వయంగా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఏర్పాట్లు పర్యవేక్షించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ను ఓపీ బ్లాక్‌గా మారుస్తున్నారు. ఈ భవనానికి ‘ధర్మస్థల’గా నామకరణం చేశారు. అయితే తాత్కాలికంగా దీనికి ఎదుట ఉన్న జీ+1 భవనాన్ని ఓపీ సేవలకు కేటాయించారు. రోజూ సుమారు 500 మందికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌, పిల్లల వైద్య సేవలతో పాటు రక్తపరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ ఇతర పరీక్షలు చేసేందుకు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు