close

ఆంధ్రప్రదేశ్

హతవిధీ.. ఎవరికి ముసుగేయాలో తెలియదా?

ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం జిల్లా చీరాలలో మాత్రం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం రాత్రే అన్ని రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు చేపట్టారు. సోమవారం ఆయా పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ క్రమంలో తమ అవగాహన రాహిత్యాన్ని చాటుతూ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మదర్‌థెరెస్సా, పొట్టి శ్రీరాములు, జ్యోతిబాపూలే, ఘంటసాల విగ్రహాలకూ ముసుగులు వేసి విమర్శల పాలయ్యారు.

 - న్యూస్‌టుడే, చీరాల అర్బన్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు