close

ఆంధ్రప్రదేశ్

2 లోక్‌సభ స్థానాలకు జనసేన అభ్యర్థులు

ప్రకటించిన పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: జనసేన తరఫున లోక్‌సభకు పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సోమవారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్‌ శేఖర్‌ పోటీ చేయనున్నారని వెల్లడించారు. ఆకుల సత్యనారాయణ ప్రస్తుత శాసనసభలో భాజపా సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శేఖర్‌ సోమవారమే విజయవాడలోని కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. శేఖర్‌ 2014లో పార్టీ ఏర్పాటు నాటి నుంచి తనకు మద్దతు తెలిపారని పవన్‌ చెప్పారు. తాడేపల్లిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్‌, తెదేపా నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ కూడా సోమవారం జనసేనలో చేరారు.
* జనసేన పార్టీ 32 మంది శాసనసభ అభ్యర్థులు, 9 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిందని పవన్‌కల్యాణ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. జాబితాను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు