close

ఆంధ్రప్రదేశ్

ఎన్నారై తెదేపా ప్రచార రథాల ప్రారంభం

ఈనాడు, అమరావతి: ఎన్నారై డిజిటల్‌ ప్రచార రథాలను చంద్రబాబు సోమవారం రాత్రి ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రవాస భారతీయులతోనూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకేసారి 100 మందితో సంభాషించారు. తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని కోరారు. సీఎంతో మాట్లాడటం సంతోషంగా ఉందని పలువురు ప్రవాస భారతీయులు పేర్కొన్నారు. డిజిటల్‌ ప్రచార రూపకర్త, తెలుగు యువత నాయకులు చిగురుపాటి ధనుంజయ, ఏపీ ఎన్నార్టీ సీఈవో వేమూరి రవిని సీఎం అభినందించారు. తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడానికి డిజిటల్‌ తెరలతో కూడిన 10 రథాలను ప్రవాస భారతీయ తెదేపా సిద్ధం చేసింది. వీటి చుట్టూ ప్రభుత్వ పథకాలను ప్రదర్శించారు. ఈ రథాలు రాష్ట్రంలోని ఏ గ్రామంలోకి వెళ్లినా.. అక్కడి ప్రజలు విదేశాల్లోని బంధుమిత్రులతో మాట్లాడే విధంగా వైఫై, ఫోన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు