close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెదాలకీ పోషణ!

ముఖం ఆకట్టుకునేలా కనిపించేలా చేయడంలో పెదాల పాత్రా కీలకమే. మరి అవి అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే... ఇలా చేసి చూడండి.

* శరీరానికి సరిపడా నీళ్లు అందకపోవడం వల్ల పెదాలకు కూడా డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవుతుంది. దాంతో లిప్‌బామ్‌లను తరచూ వాడాల్సిన పరిస్థితి. అలాకాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్లరసాలు తీసుకోవాలి. రసాయనాలు లేని నాణ్యమైన, లిప్‌బామ్‌లు ఎంచుకోవాలి. అప్పుడే పెదాలు పొడిబారకుండా ఎక్కువసేపు తాజాగా, తేమతో ఉంటాయి.
* లిప్‌స్టిక్‌లు పెదాలకు అందాన్ని తెస్తాయనేది ఎంత వాస్తవమో... వాటిలోని వ్యాక్స్‌ హానిచేస్తుందనేదీ అంతే నిజం. కాబట్టి మరీ అవసరమైతే తప్ప లిప్‌స్టిక్‌ వేసుకోవాలనే నియమాన్ని పెట్టుకోవాలి. ఈ రోజుల్లో రంగురంగుల లిప్‌గ్లాస్‌లు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
* కొందరి పెదాలు ఏడాదిపొడవునా పగిలిపోయి, నల్లగా మారతాయి. మృతకణాలు పేరుకోవడం అందుకు కారణమే. టూత్‌బ్రష్‌ని పంచదారలో ముంచి పెదాలపై నెమ్మదిగా రుద్దండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు. ఫలితం కనిపిస్తుంది. మృతకణాలు పోయి, మృదువుగా మారతాయి.


మరిన్ని