close

ఆంధ్రప్రదేశ్

  68 దశల్లో తొలి ఎన్నికలు!

 సుదీర్ఘం 

స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికల క్రతువు 119 రోజుల పాటు కొనసాగింది. మొత్తం 68 దశల్లో అక్టోబరు 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 మధ్య ఎన్నికలు జరిగాయి. మొత్తం 489 స్థానాలకుగాను 1,849 మంది అభ్యర్థులు తలపడ్డారు. 36 కోట్ల మంది ఓటర్లలో 44.9% మందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్‌ 2, 1952న లోక్‌సభ కొలువుదీరింది. ఆ మరుసటి నెల 13న మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 364, లెఫ్ట్‌ 20, సోషలిస్ట్‌ పార్టీ 12, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ 9, భారతీయ జన్‌సంఘ్‌ 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఇతరులకు 81 స్థానాలు దక్కాయి. తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా సుకుమార్‌ సేన్‌ వ్యవహరించారు. 1951 సెప్టెంబరు 2న దిల్లీలోని నంగలోయీలో నమూనా ఎన్నికలు జరిగాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు