close

ఆంధ్రప్రదేశ్

కాలం కలిసి రావాలని...

దైనా ఆలయానికి వెళ్లినప్పుడు డబ్బు, ఆభరణాలు, ఇతరత్రా ముడుపులు వినమ్రంగా సమర్పించుకోవడం మనకు అలవాటే. కొన్నిచోట్ల మన బరువు ఎంత ఉంటే అంత బంగారాన్నో, నాణేలనో ఇచ్చి, మనసులో కోరికలు నెరవేరాలని కోరుకుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బ్రహ్మబాబా ఆలయానికి మాత్రం ఇలాంటివేమీ కాకుండా పనిచేస్తున్న స్థితిలో ఉన్న గోడ గడియారాన్ని సమర్పించుకుంటారు. ఆ రకంగా తమకు మంచి కాలం కలిసిరావాలని కోరుకుంటారు. ఈ ఆలయం జాన్‌పున్‌ జిల్లాలోని మరియహాహున్‌ సమీపంలో ఉంది. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో చాలామంది ఇక్కడకు వస్తున్నారు. పువ్వుల బదులు గడియారాలు తెచ్చి ఆలయం వద్ద అర్పిస్తున్నారు. టికెట్ల ప్రయత్నాల్లో లఖ్‌నవూకు వెళ్తూవెళ్తూ మధ్యలో ఇక్కడ ఆగి మొక్కుకుంటున్నారు. ఆలయం బయట‌ సమర్పించే గడియారాల వద్ద కాపలాదారులెవరూ ఉండకపోయినా వాటి జోలికి ఎవరూ వెళ్లకపోవడం మరో విశేషం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు