close

ఆంధ్రప్రదేశ్

రాజకీయ కథా చిత్రం

జకీయం సినిమా రంగు పులుముకుంటోంది. మేకప్‌ వేసుకుని ఎన్నికల్లో తమ నటనా కౌశలాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కొందరు లొకేషన్‌ చూసుకుని..ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామో? అవకాశమనే టికెట్‌ ఇచ్చే డెరెక్టర్‌ ఎవరో..ఖర్చు భరించే నిర్మాత ఎక్కడున్నారో వెదుక్కుని మరీ రంగ ప్రవేశం చేస్తుంటే..మరికొందరు తమ అభిమాన పార్టీల అధినేతలకు ఉడతా భక్తి సాయం చేసేందుకు పార్టీ కండువాలు కప్పుకొంటున్నారు. మొత్తంగా క్లాప్‌ కొట్టకుండానే ఈ దఫా చాలామంది ఎన్నికల రంగస్థలం ఎక్కారు.

తెదేపా

ఎన్టీఆర్‌ కుమారుడు, సినీ కథానాయకుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేయబోతున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్‌ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నా..ఆయన తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు వల్లభనేని వంశీ, మాగంటి బాబు ఎన్నికల బరిలో ఉన్నారు. కథా నాయిక దివ్యవాణి, వాణి విశ్వనాథ్‌ కొద్ది నెలల క్రితం తెదేపాలో చేరారు. ఇక తెర వెనుక ప్రచార పటాలు, టీవీ ప్రకటనలు రూపకల్పన బాధ్యతలను దర్శకులు బోయపాటి శ్రీనివాస్‌, మరికొందరు దర్శకులు భుజానికెత్తుకున్నట్టు సమాచారం.

వైకాపా

వైకాపా తరఫున చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హాస్య నటుడు పృథ్వీరాజ్‌, రచయిత పోసాని కృష్ణమురళి తదితరులు కొంత కాలంగా వివిధ వేదికలపై వైకాపా గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి జయసుధ, హాస్యనటుడు అలీ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్‌, పాతతరం సినీ హీరో భానుచందర్‌, వర్ధమాన నటులు కృష్ణుడు పార్టీలో చేరారు., సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) విజయవాడ బరిలోఉన్నారు.

జనసేన

కథా నాయకుడు పవన్‌కల్యాణ్‌ పార్టీ అధినేత కాగా..ఆయన సోదరుడు నాగబాబు ఆయన తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. జబర్దస్త్‌ ఫేమ్‌ ఆది ఆ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటుండగా..షకలక శంకర్‌ తదితరులు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు.

- ఈనాడు, అమరావతి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు