close

ఆంధ్రప్రదేశ్

పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు 

పదేపదే ఆరోపణలు చేస్తున్న జగన్‌, విజయసాయిరెడ్డి 
ఎన్నికల సంఘానికి విన్నవించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం

ఈనాడు, అమరావతి: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు, నిఘా వ్యవస్థను కించపరిచేలా, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల వేళ ప్రభుత్వ వ్యవస్థలపై, వాటిని నిర్వహించే అధికారులపై రాజకీయ దాడులు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.మస్తాన్‌ ఖాన్‌ల నేతృత్వంలో ప్రతినిధులు ఆదివారం వెలగపూడిలోని సచివాలయంలో ద్వివేదిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కొంతమంది రాజకీయ నాయకులు అధికారులను పేరుపెట్టి దూషిస్తూ, దుస్సంప్రదాయానికి తెరలేపారని వివరించారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ‘‘అధికారుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడే ముందు రాజకీయ నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అధికారులపై చేసే ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా? లేదా అనేది చూడాలి. ఆధారాలుంటే ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. వారి విచారణలో ఫిర్యాదులోని నిజానిజాలు ఎంతో తేలుతాయి’’ అని అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు