close

ఆంధ్రప్రదేశ్

యూపీలో ‘మిత్రుల’తో కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

లఖ్‌నవూ: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచేలా కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాలను విడిచిపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అందులో ఏడు స్థానాలను ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలకు వదిలేశామని వెల్లడించారు. అందులోభాగంగానే మొయిన్‌పురి, కనౌజ్‌, ఫిరోజాబాద్‌తో పాటు బీఎస్పీ అధినేత మాయావతి, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ తనయుడు జయంత్‌ చౌదరి పోటీ చేసే అవకాశం ఉన్న చోట తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపడం లేదని వివరించారు. ఎస్పీ, బీఎస్పీలు సోనియా, రాహుల్‌ కోసం రాయ్‌బరేలీ, అమేఠీలను కేటాయించిన విషయం విదితమే. దానికి బదులుగా తాము కూడా ఆయా స్థానాలను ఇస్తున్నామని ఆయన చెప్పారు. మాయావతికి అత్యంత సన్నిహితుడు, బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి బయటకు వచ్చిన బాబుసింగ్‌ కుశ్వాహా స్థాపించిన జన్‌ అధికార పార్టీతో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు