close

ఆంధ్రప్రదేశ్

దిల్లీలో ఏడో స్థానానికీ అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దిల్లీలో తన చిట్టచివరి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఇక్కడ పొత్తు విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా లేదని, బాధ్యతారాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తాజాగా ప్రకటించిన పశ్చిమ దిల్లీ పార్లమెంటరీ సీటు కోసం బల్బీర్‌ సింగ్‌ జక్కర్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దిల్లీలో ఏడు స్థానాలు ఉండగా ఆరు సీట్లకు ఆప్‌ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. ‘‘ఈ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమవుతాయని భావించాం. ఇందుకోసం చాలాకాలం ఎదురుచూశాం. గత మూడు నెలలుగా కాంగ్రెస్‌ వైఖరి అస్పష్టంగా ఉంది’’ అని ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు