close

ఆంధ్రప్రదేశ్

బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకం ఖరారు

పట్నా: బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారయింది. మొత్తం 40 స్థానాలకుగానూ భాజపా 17, జేడీ(యూ) 17, ఎల్‌జేపీ ఆరు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని మూడు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఆదివారం నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కూటమి సర్కారు స్థిరంగా ఉండదు: జైట్లీ
వివిధ పార్టీల కూటమితో ఏర్పాటయిన ప్రభుత్వం స్థిరంగా ఉండదని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. గతంలో ఇది నిరూపితమయిందన్నారు. ఎన్నికలపై బ్లాగులో తన అభిప్రాయాలు రాస్తూ సుస్థిర ప్రభుత్వమే కావాలని, ఈ విషయంలో ప్రజలు సరయిన నిర్ణయమే తీసుకుంటారని తెలిపారు.

కాంగ్రెస్‌వి దూషణ రాజకీయాలు: జావడేకర్‌
కాంగ్రెస్‌ పార్టీ దూషణ రాజకీయాలకు పాల్పడుతోందని, అయితే వీటిని భాజపా తిప్పికొట్టదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. వీటికి ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు.
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ టిక్కెట్‌ ఇవ్వవద్దని భాజపా సీనియర్‌ నేత సత్యనారాయణ (సత్తన్‌) కోరారు. ఒకవేళ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని హెచ్చరించారు.

అమిత్‌ షా గాంధీనగర్‌ నుంచి పోటీ చేయాలి
ఇంతవరకు ఎల్‌.కె.ఆడ్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఆడ్వాణీ, వాజపేయి వంటి నాయకులు ఈ స్థానం నుంచి గెలిచారని, అందువల్ల జాతీయ స్థాయి నాయకులే ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఆడ్వాణీ 1991 నుంచి (1996లో మినహా) ఆరుసార్లు గెలిచారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు