close

ఆంధ్రప్రదేశ్

స్తబ్దతను మారుస్తా.. అందుకే వచ్చా: ప్రియాంక

లఖ్‌నవూ: యూపీలో స్తబ్దుగా మారిన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే బాధ్యత తనదేనని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి (తూర్పు యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాలు) ప్రియాంకా గాంధీ ఆదివారం అన్నారు. యూపీలో పర్యటన నిమిత్తం ఆమె ఇక్కడికి చేరుకున్నారు. యూపీలో నెలకొన్న ఈ స్తబ్దత మూలంగానే యువత, మహిళలు, రైతులు, కార్మికులు తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్నట్లు ఆమె చెప్పారు. తమ సాధకబాధకాలను వెలిబుచ్చాలనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వారి స్వరమే వినపడటమే లేదన్నారు. అయితే, బాధితులు తమ గళం విప్పకుండా, కష్టాన్ని పంచుకోకుండా అలాగే ఉంటే మార్పు దుర్లభమన్నారు. అందుకే, వారి సాధకబాధకాల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు (సచ్ఛా సంవాద్‌) ప్రజల ముంగిట్లోకే వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ప్రజలతో సంభాషించిన తర్వాత రాజకీయాల్లో మార్పు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానంటూ ఆమె వాగ్దానం చేశారు.

సత్యానికి...సమానత్వానికి గంగానది ప్రతీక. యూపీకి జీవనాడి గంగానది. గంగానదీమతల్లి సాయంతోనే ప్రజలను చేరుకుంటానంటూ ప్రియాంక ఆ లేఖలో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు