close

ఆంధ్రప్రదేశ్

మళ్లీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు

మంత్రి అమరనాథరెడ్డి వెల్లడి

వి.కోట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెదేపా మళ్లీ అధికారం చేపడితే విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తామని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్నారు. ఉచిత విద్యుత్‌ కింద ఏటా రూ.7 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇజ్రాయెల్‌ తరహా బిందు సేద్యాన్ని ప్రవేశపెడితే నాడు ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రజాధనం వృథా చేస్తున్నట్లు దుమ్మెత్తిపోసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిందుసేద్యం లేకుండా ఎక్కడా వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు