close

ఆంధ్రప్రదేశ్

ఆ పల్లెల్లో భయం భయం

మంత్రాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయినా వైకాపా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి కంచుకోటగా భావిస్తున్న పల్లెల్లో ప్రజలను భయం వీడడం లేదు. తెదేపా అభ్యర్థి పి.తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ, ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డి తెదేపా నాయకులతో కలిసి ఆదివారం ప్రచారం చేయడానికి వెళ్లారు. రాంపురం, బసాపురం, కాచాపురం గ్రామాల్లో ప్రజలు భయంతో ఇళ్లలో ఉండే గడియలు వేసుకున్నారు. ఆదోని డీఎస్పీ వెంకటరాముడు, ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు, వంద మంది కేంద్ర, పోలీసు బలగాలతో గ్రామానికి వెళ్లినా స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కొందరు తలుపులు మూసి కిటీకిల్లోంచి చూశారు. తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులు మూసిన తలుపులకే కరపత్రాలు అతికించి వెనుదిరిగారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాంపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయానికి తాళం వేయడంతో బయట నుంచే దర్శనం చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు