close

ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి

పిట్టగోడ కూలి పది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

డెంకాడ, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా డెంకాడలో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార రథం వద్దకు జగన్‌ వస్తున్న సమయంలో.. పక్కనే ఓ బ్యాంకు ఏటీఎం ఉన్న భవనం రెండో అంతస్తు పిట్టగోడ కూలింది. దీనికింద నిల్చున్న పతివాడ రమణమ్మ, సరగడ వెంకటేష్‌, అట్టాడ శివకృష్ణ, మోపాడ బంగారప్పడు, కొర్నాన సూరిబాబు, తుమ్మగంటి నారాయణమ్మ, తుమ్మగంటి బంగారమ్మ, కల్లేపల్లి ఆదిలక్ష్మి, పతివాడ చిన్న, పి.పైడిరాజు గాయాలపాలయ్యారు. వీరిలో పైడిరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇరుకైన ప్రదేశంలో సభ ఏర్పాటుతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు