close

ఆంధ్రప్రదేశ్

175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన జగన్‌ 

16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా.. 
బీసీల పేరుతో  తెదేపా జాబితాలోనూ మోసం 
ప్రజాభిప్రాయం ఆధారంగానే కొందరు సిట్టింగులకు ఇవ్వలేదు 
వైకాపా అధ్యక్షుడు జగన్‌ వెల్లడి 
ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా విడుదల

వైకాపా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 41మంది బీసీలకు అవకాశం కల్పించామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోమోహనరెడ్డి తెలిపారు. తెదేపా మాత్రం జాబితాలో బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చినట్లు సంఖ్యను మార్చారని.. బలిజలను కూడా బీసీలుగా చూపించారని విమర్శించారు. బలిజలను బీసీలుగా చూపితే తమ జాబితాలో బీసీల సంఖ్య 45కు చేరుతుందన్నారు. ఆదివారం ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా జగన్‌ మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో మైనారిటీలకు నాలుగు సీట్లు ఇవ్వగా.. ఇప్పుడు ఒకటి పెంచి అయిదుగురికి ఇచ్చాం. ప్రజాభిప్రాయం, సర్వేల ఆధారంగా ఎవరైతే మంచి అభ్యర్థి అవుతారనుకున్న చోట కొంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈసారి  టికెట్‌ ఇవ్వలేదు. దేవుడి దయ, నాన్న దీవెన, ప్రజల ఆశీస్సులతో జాబితాలో ఉన్న వారంతా గెలవాలని ఆశిస్తున్నాం’ అని జగన్‌ ఆకాక్షించారు. 

జగన్‌ సమక్షంలో వైకాపా సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను, బాపట్ల లోక్‌సభ అభ్యర్థి నందిగాం సురేష్‌.. లోక్‌సభ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటున్న చంద్రబాబు.. ఆయన పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఒకేసారి ప్రకటించుకోలేకపోయారు. తెదేపా నుంచి ఇప్పటికే అనేక మంది వైకాపాలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలిన వారు పార్టీ వదిలేసి వెళ్లిపోతారేమోనన్న అభద్రతా భావంలో ఉన్నారు. చంద్రబాబు శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన తొలి సభలో పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నారంటూ ఆయనే అన్నారు. రెండు చేతులూ ఎత్తి మద్దతు తెలపండని చంద్రబాబు అడిగినా స్పందన లేదు’ అని అన్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న జగన్‌.. రోడ్డు మార్గంలో ఇడుపులపాయ చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళిలర్పించారు. తర్వాత అక్కడే అభ్యర్థులను ప్రకటించారు. వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో వైకాపా తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు జగన్‌ బయల్దేరారు. కార్యక్రమంలో వైకాపా ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సి.రామచంద్రయ్య, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వైకాపా వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా శాసనసభ అభ్యర్థులు

కడప 
జమ్మలమడుగు: ఎం.సుధీర్‌రెడ్డి 
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాదరెడ్డి  
మైదుకూరు: శెట్టిపల్లి రఘురామిరెడ్డి 
కమలాపురం: పోచింరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి 
బద్వేలు: గుంతోటి వెంకటసుబ్బయ్య 
కడప: బేపారి షేక్‌ అంజాద్‌ బాషా  
పులివెందుల: వైఎస్‌ జగన్మోహనరెడ్డి 
రాజంపేట: మేడా వెంకట మల్లికార్జునరెడ్డి 
రైల్వేకోడూరు: కొరుముట్ల శ్రీనివాసులు 
రాయచోటి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
చిత్తూరు 
తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి 
పీలేరు: చింతల రామచంద్రారెడ్డి 
మదనపల్లి: నవాజ్‌ బాషా 
పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
శ్రీకాళహస్తి: బియ్యపు మధుసూధన్‌ రెడ్డి  
సత్యవేడు (ఎస్సీ): కె.ఆదిమూలం 
చంద్రగిరి: చెవిరెడ్డి భాస్కరరెడ్డి  
పూతలపట్టు (ఎస్సీ): ఎంఎస్‌ బాబు 
నగరి: ఆర్‌కే రోజా సెల్వమణి 
గంగాధర నెల్లూరు (ఎస్సీ): కె.నారాయణ స్వామి 
చిత్తూరు: అరణి శ్రీనివాసులు  
(జంగాలపల్లి శ్రీనివాసులు) 
తిరుపతి: భూమన కరుణాకరరెడ్డి 
పలమనేరు: ఎన్‌.వెంకటయ్య గౌడ 
కుప్పం: కె.చంద్రమౌళి
అనంతపురం 
అనంతపురం: అనంత వెంకట్రామిరెడ్డి 
రాప్తాడు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 
మడకశిర: ఎం.తిప్పేస్వామి 
ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 
ఉరవకొండ: వై.విశ్వేశ్వరరెడ్డి 
తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి 
శింగనమల (ఎస్సీ): జొన్నలగడ్డ పద్మావతి 
కళ్యాణదుర్గం: కేవీ ఉషశ్రీ చరణ్‌ 
కదిరి: పీవీ సిద్దారెడ్డి 
గుంతకల్‌: ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి 
రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి 
హిందూపురం: కె.ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌ 
పెనుకొండ: ఎం.శంకరనారాయణ 
పుట్టపర్తి: డి.శ్రీధర్‌రెడ్డి
కర్నూలు 
ఆదోని: వై.సాయి ప్రసాద్‌రెడ్డి 
కర్నూలు: హఫీజ్‌ ఖాన్‌ 
ఎమ్మిగనూరు: కె.చెన్నకేశవరెడ్డి 
పత్తికొండ: కె.శ్రీదేవి 
ఆలూరు: పి.జయరామ్‌ (గుమ్మనూరు జయరామ్‌) 
మంత్రాలయం: వై.బాలనాగిరెడ్డి 
కోడుమూరు (ఎస్సీ): సుధాకర్‌బాబు 
నంద్యాల: శిల్పా రవిచంద్రారెడ్డి 
ఆళ్లగడ్డ: గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి 
బనగానపల్లె: కాటసాని రామిరెడ్డి 
శ్రీశైలం: శిల్పా చక్రపాణిరెడ్డి 
పాణ్యం: కాటసాని రాంభూపాల్‌రెడ్డి 
డోన్‌: బుగ్గన రాజేంద్రనాథ్‌ 
నందికొట్కూరు (ఎస్సీ): ఆర్థర్‌
నెల్లూరు 
కావలి: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 
నెల్లూరు నగరం: పోలుబోయిన 
అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 
కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 
నెల్లూరు గ్రామీణం: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 
ఆత్మకూరు: మేకపాటి గౌతంరెడ్డి 
వెంకటగిరి: ఆనం రామనారాయణరెడ్డి 
గూడూరు (ఎస్సీ): వి.వరప్రసాద్‌ 
సర్వేపల్లి: కాకాని గోవర్దన్‌రెడ్డి 
సూళ్లూరుపేట (ఎస్సీ): కిలివేటి సంజీవయ్య
ప్రకాశం 
చీరాల: ఆమంచి కృష్ణమోహన్‌ 
పర్చూరు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు 
సంతనూతలపాడు (ఎస్సీ): టీజేఆర్‌ సుధాకర్‌బాబు 
ఆద్దంకి: బాచిన చెంచు గరటయ్య 
కందుకూరు: మానుగుంట మహీధర్‌రెడ్డి 
కొండపి (ఎస్సీ): ఎం.వెంకయ్య 
ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి 
దర్శి: మద్దిశెట్టి వేణుగోపాల్‌ 
మార్కాపురం: కేపీ నాగార్జునరెడ్డి 
కనిగిరి: బుర్రా మధుసూదన యాదవ్‌ 
యర్రగొండపాలెం (ఎస్సీ): ఆదిమూలపు సురేశ్‌ 
గిద్దలూరు: అన్నా వెంకట రాంబాబు
గుంటూరు 
రేపల్లె: మోపిదేవి వెంకటరమణరావు 
వేమూరు (ఎస్సీ): మేరుగు నాగార్జున 
బాపట్ల: కోన రఘుపతి 
మంగళగిరి: ఆళ్ల రామకృష్ణారెడ్డి 
పొన్నూరు: కిలారి రోశయ్య 
తాడికొండ (ఎస్సీ): ఉండవల్లి శ్రీదేవి 
గుంటూరు పశ్చిమ: చంద్రగిరి ఏసురత్నం 
తెనాలి: అన్నాబత్తుని శివకుమార్‌ 
ప్రత్తిపాడు (ఎస్సీ): మేకతోటి సుచరిత 
గుంటూరు తూర్పు: షేక్‌ మహ్మద్‌ మస్తఫా 
పెదకూరపాడు: నంబూరి శంకరరావు 
చిలకలూరిపేట: విడదల రజని 
సత్తెనపల్లి: అంబటి రాంబాబు 
వినుకొండ: బొల్లా బ్రహ్మనాయుడు 
నరసరావుపేట: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 
మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 
గురజాల: కాసు మహేశ్‌రెడ్డి
కృష్ణా 
నూజివీడు: మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 
కైకలూరు: దూలం నాగేశ్వరరావు 
గన్నవరం: యార్లగడ్డ వెంకటరావు 
పెనమలూరు: కొలుసు పార్థసారథి 
పెడన: జోగి రమేశ్‌ 
మచిలీపట్నం: పేర్ని వెంకట్రామయ్య (నాని) 
అవనిగడ్డ: సింహాద్రి రమేశ్‌బాబు 
పామర్రు (ఎస్సీ): కె.అనిల్‌ కుమార్‌ 
గుడివాడ: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) 
విజయవాడ తూర్పు: బొప్పన భవకుమార్‌ 
నందిగామ (ఎస్సీ): మొండితోక జగన్మోహన్‌రావు 
జగ్గయ్యపేట: సామినేని ఉదయభాను 
విజయవాడ సెంట్రల్‌: మల్లాది విష్ణువర్ధన్‌ 
(మల్లాది విష్ణు) 
మైలవరం: వసంత కృష్ణప్రసాద్‌ 
తిరువూరు (ఎస్సీ): కొక్కిలిగడ్డ రక్షణనిధి 
విజయవాడ పశ్చిమ: వెల్లంపల్లి శ్రీనివాసరావు
పశ్చిమగోదావరి 
దెందులూరు: కొటారు అబ్బయ్య చౌదరి 
ఏలూరు: ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) 
చింతలపూడి (ఎస్సీ): వీఆర్‌.ఎలీజ 
ఉంగుటూరు: పుప్పాల శ్రీనివాసరావు 
పోలవరం (ఎస్టీ): తెల్లం బాలరాజు 
ఉండి: పీవీఎల్‌ నరసింహరాజు 
తణుకు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు 
పాలకొల్లు: చవటపల్లి సత్యనారాయణమూర్తి 
(డాక్టర్‌ బాబ్జి) 
భీమవరం: గ్రంథి శ్రీనివాస్‌ 
ఆచంట: చెరుకువాడ శ్రీరంగనాథరాజు 
(రంగరాజు) 
తాడేపల్లిగూడెం: కొట్టు సత్యనారాయణ 
నరసాపురం: ముదునూరి ప్రసాద్‌రాజు 
నిడదవోలు: జీఎస్‌ నాయుడు 
కొవ్వూరు (ఎస్సీ): తానేటి వనిత 
గోపాలపురం (ఎస్సీ): తలారి వెంకట్రావు
తూర్పుగోదావరి 
మండపేట: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ 
రామచంద్రపురం: చెల్లుబోయిన శ్రీనివాస 
వేణుగోపాలకృష్ణ 
పి.గన్నవరం (ఎస్సీ): కొండేటి చిట్టిబాబు 
కొత్తపేట: చిర్ల జగ్గిరెడ్డి 
అమలాపురం (ఎస్సీ): పినిపె విశ్వరూప్‌ 
ముమ్మిడివరం: పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ 
రాజోలు (ఎస్సీ): బొంతు రాజేశ్వరరావు 
రంపచోడవరం (ఎస్టీ): నాగులాపల్లి ధనలక్ష్మి 
కాకినాడ పట్టణం: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి 
పెద్దాపురం: తోట వాణి 
కాకినాడ గ్రామీణం: కురసాల కన్నబాబు 
ప్రత్తిపాడు: పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్‌ 
పిఠాపురం: పెండెం దొరబాబు 
జగ్గంపేట: జ్యోతుల చంటిబాబు 
తుని: దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) 
రాజమండ్రి నగరం: రౌతు సూర్యప్రకాశరావు 
రాజానగరం: జక్కంపూడి రాజా 
రాజమండ్రి గ్రామీణం: ఆకుల వీర్రాజు 
అనపర్తి: సత్తి సూర్యనారాయణరెడ్డి
విశాఖపట్నం 
అనకాపల్లి: గుడివాడ ఏవీఎస్‌ఎస్‌ అమర్‌నాథ్‌ 
పెందుర్తి: అదీప్‌ రాజ్‌ 
యలమంచిలి: ఉప్పలపాటి వెంకటరమణ 
మూర్తి రాజు (కన్నబాబు రాజు) 
నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ 
చోడవరం: కరణం ధర్మశ్రీ 
జి.మాడుగుల: బూడి ముత్యాల నాయుడు 
పాయకరావుపేట (ఎస్సీ): గొల్ల బాబూరావు 
పాడేరు (ఎస్టీ): భాగ్యలక్ష్మి 
అరకు (ఎస్టీ): చెట్టి ఫల్గుణ 
విశాఖపట్నం తూర్పు: అకరమాని విజయనిర్మల 
విశాఖపట్నం పశ్చిమ: మళ్ల విజయప్రసాద్‌ 
విశాఖపట్నం దక్షిణ: ద్రోణంరాజు శ్రీనివాస్‌ 
గాజువాక: తిప్పల నాగిరెడ్డి 
విశాఖపట్నం ఉత్తర: కేకే రాజు 
భీమిలి: ముత్తంశెట్టి శ్రీనివాస్‌ (అవంతి శ్రీనివాస్‌)
విజయనగరం 
పార్వతీపురం (ఎస్సీ): అలజంగి జోగారావు 
సాలూరు (ఎస్టీ): పీడిక రాజన్నదొర 
కురుపాం (ఎస్టీ): పాముల పుష్ప శ్రీవాణి 
శృంగవరపుకోట: కె.శ్రీనివాస్‌ 
విజయనగరం: కోలగట్ల వీరభద్రస్వామి 
నెల్లిమర్ల: బడుకొండ అప్పలనాయుడు 
బొబ్బిలి: సంబంగి వెంకట చిన అప్పలనాయుడు 
చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ 
గజపతినగరం: బొత్స అప్పలనర్సయ్య
శ్రీకాకుళం 
పాలకొండ (ఎస్టీ): విశ్వసరాయి కళావతి 
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు 
నర్సన్నపేట: ధర్మాన కృష్ణదాసు 
టెక్కలి: పేరాడ తిలక్‌ 
ఆమదాలవలస: తమ్మినేని సీతారాం 
పాతపట్నం: రెడ్డి శాంతి 
పలాస: సీదిరి అప్పలరాజు 
ఇచ్ఛాపురం: పిరియా సాయిరాజ్‌ 
రాజాం (ఎస్సీ): కంబాల జోగులు 
ఎచ్చెర్ల: గొర్లె కిరణ్‌ కుమార్‌లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా 
శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్‌ 
విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌ 
విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ 
అనకాపల్లి - డాక్టర్‌ వెంకట సత్యవతి 
కాకినాడ - వంగా గీత 
రాజమహేంద్రవరం - మార్గాని భరత్‌ 
ఏలూరు - కోటగిరి శ్రీధర్‌ 
నరసాపురం - కె.రఘురామకృష్ణంరాజు 
విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ 
మచిలీపట్నం - బాలశౌరి 
గుంటూరు - మోదుగుల వేణుగోపాలరెడ్డి 
నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు 
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి 
నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌రెడ్డి 
నంద్యాల - పోచ బ్రహ్మానందరెడ్డి 
తిరుపతి - బల్లి దుర్గాప్రసాద్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు