close

ఆంధ్రప్రదేశ్

అలరించిన నిజామి బ్రదర్స్‌ ఖవ్వాలి

ఈనాడు, దిల్లీ: దిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా నిజామి బ్రదర్స్‌ ఖవ్వాలి ఆహూతులను అలరించింది. సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లోని కడప అమీన్‌ పీర్‌ దర్గా వైశిష్ట్యాన్ని విశదీకరిస్తూ ఖవ్వాలి నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అమీన్‌ పీర్‌దర్గా ప్రాశస్త్యాన్ని దిల్లీ వాసులకు అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ భారత అజ్మీర్‌గా పేరుగాంచిన ఈ దర్గా ప్రత్యేకతను అద్భుతంగా వర్ణించారని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు