close

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు 2 రోజుల పర్యటన ఇలా..

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల పర్యటన షెడ్యూల్‌ను తెదేపా పార్టీ విడుదల చేసింది.
సోమవారం..:
* ఉదయం 11 గంటలకు నెల్లూరులో జరిగే ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 1.15 గంటలకు ఒంగోలులోని టంగుటూరు ప్రకాశం పంతులు వర్సీటీ మైదానంలో నిర్వహించే   సమావేశానికి హాజరవుతారు.
* మధ్యాహ్నం 3.45 గంటలకు గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో సమావేశంలో పాల్గొంటారు.
* సాయంత్రం 5.45 గంటలకు కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో సభకు హాజరవుతారు.
మంగళవారం:
* ఉదయం 10.30 గంటలకు కర్నూలు జిల్లా ఎస్టీబీసీ కళాశాలలో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం అనంతపురంలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో సమావేశానికి హాజరవుతారు.
* 3.20 గంటలకు కడపలోని మున్సిపల్‌ స్టేడియంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు.

పారికర్‌ మృతికి సీఎం సంతాపం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. ఐఐటీ విద్యనభ్యసించి సీఎంగా ఎన్నికై పారికర్‌ గోవా రాష్ట్రానికి అందించిన సేవలు మరిచిపోలేనివని శ్లాఘించారు. నిజాయతీకి, అంకితభావానికి ఆయన నిదర్శనమని.. చివరిశ్వాస వరకు దేశానికి సేవ చేశారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌కల్యాణ్‌
పారికర్‌ మృతి బాధాకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ‘పారికర్‌తో కలిసి 2014లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఆవేదన కలిగించింది. నా తరఫున, జనసైనికుల తరఫున పారికర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు