close

ఆంధ్రప్రదేశ్

కృష్ణావతారంలో కోనేటిరాయుడు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో కోనేటిరాయుడు శ్రీవారి పుష్కరిణిలో తెప్పపై విహరించారు. మూడు సార్లు స్వామివారు ప్రదక్షిణ చేస్తుండగా భక్తకోటి దర్శించుకుంది. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు సోమవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తెప్పపై ఊరేగనున్నారు. కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, తిరుమల

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు