close

ఆంధ్రప్రదేశ్

పిల్లలూ.. ఒత్తిడికి లోనుకావద్దు

పదో తరగతి విద్యార్థులకు చంద్రబాబు దిశానిర్దేశం

ఈనాడు, అమరావతి: ఒత్తిడికి దూరంగా కష్టపడి చదివిన జవాబులను మనసు పెట్టి రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎం ఆదివారం చేసిన ట్విట్‌లో ‘‘పిల్లలు ఆందోళనకు లోనుకాకుండా ఉండేలా ప్రేమగా చూడాలని తల్లిదండ్రులను కోరుతున్నా. పరీక్షల్లో ఒకట్రెండు పొరబాట్లు చేసినా సరిదిద్దుకుని తదుపరి పరీక్షలు బాగా రాస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్‌ పరంగా సమస్యలు రాకుండా పార్టీ కార్యకర్తలు చూడాలి. దక్షిణ కొరియా దేశంలో విద్యార్థులకు ముఖ్యమైన పరీక్షలు జరుగుతున్న సమయంలో నిశ్శబ్ధంగా ఉండేలా చూస్తున్నారు. రోడ్లపై విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పౌరులు కూడా సహకరిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తుకు మనం చేయగలిగినంత త్యాగం చేద్దాం’’ అని పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు