close

ఆంధ్రప్రదేశ్

బరిలో బంధుగణం

జగన్‌ సహా నలుగురికి చోటు
బొత్స కుటుంబం నుంచి ముగ్గురు

ఈనాడు, అమరావతి: వైకాపా టికెట్ల కేటాయింపులో ముఖ్యనేతల బంధుగణానికి పెద్దపీట‌ వేశారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ప్రాధాన్యం కొంత తగ్గింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌ బంధువర్గం నుంచి నలుగురికి టికెట్లు లభించాయి. ఆయన సిట్టింగ్‌ స్థానమైన పులివెందుల నుంచే రంగంలోకి దిగుతున్నారు. జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానమైన కమలాపురం స్థానం నుంచే బరిలో నిలుస్తున్నారు. ఆయన సన్నిహిత బంధువైన ఎంపీ అవినాశ్‌రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించిన కడప నుంచే మళ్లీ పోటీకి దిగుతున్నారు. జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి బావమరిది, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు అసెంబ్లీ టికెట్‌ దక్కింది. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి ఈసారి కూడా టికెట్‌ కోరినా ఫలితం లేకపోయింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఆ సీటు కేటాయించారు.
* చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిట్టింగ్‌ స్థానమైన పుంగనూరు దక్కింది. ఆయన తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి తొలిసారిగా తంబళ్లపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రాజంపేట లోక్‌సభ నుంచే మరోసారి పోటీ చేస్తున్నారు. తండ్రి, బాబాయ్‌ పోటీ చేసే రెండు నియోజకవర్గాలు తనయుడు రంగంలోకి దిగే రాజంపేట లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి.
* విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ముగ్గురికి సీట్లు కేటాయించారు. ఆయనకు చీపురుపల్లి, తమ్ముడు అప్పలనర్సయ్యకు గజపతినగరం, దగ్గర బంధువు బి.అప్పలనాయుడుకు నెల్లిమర్ల టికెట్లు కేటాయించారు.  సత్యనారాయణ భార్య ఝాన్సీకి విజయనగరం లోక్‌సభ స్థానం ఆశించినా టికెట్‌ లభించలేదు.
* నెల్లూరు సిట్టింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఆయన కుమారుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి.. సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి అసెంబ్లీ టికెట్లుదక్కించుకున్నారు.
* శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ఆయన సోదరుడు కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి టికెట్‌ దక్కించుకున్నారు.  వలే పార్టీలో చేరిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఆ సీటు కేటాయించారు.
* చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిట్టింగ్‌ స్థానమైన పుంగనూరు దక్కింది. ఆయన తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి తొలిసారిగా తంబళ్లపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రాజంపేట లోక్‌సభ నుంచే మరోసారి పోటీ చేస్తున్నారు. తండ్రి, బాబాయ్‌ పోటీ చేసే రెండు నియోజకవర్గాలు తనయుడు రంగంలోకి దిగే రాజంపేట లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి.
* విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ముగ్గురికి సీట్లు కేటాయించారు. ఆయనకు చీపురుపల్లి, తమ్ముడు అప్పలనర్సయ్యకు గజపతినగరం, దగ్గర బంధువు బి.అప్పలనాయుడుకు నెల్లిమర్ల టికెట్లు కేటాయించారు.  సత్యనారాయణ భార్య ఝాన్సీకి విజయనగరం లోక్‌సభ స్థానం ఆశించినా టికెట్‌ లభించలేదు.
* నెల్లూరు సిట్టింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఆయన కుమారుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి.. సోదరుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి అసెంబ్లీ టికెట్లుదక్కించుకున్నారు.
* శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ఆయన సోదరుడు కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి టికెట్‌ దక్కించుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు